క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చు

ABN , First Publish Date - 2022-05-18T06:22:12+05:30 IST

ఆనలైనలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆ స్తి పన్ను చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, కమిషనర్‌ రమణాచారి తెలిపారు.

క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చు

రామగిరి, నల్లగొండ రూరల్‌, మే 17: ఆనలైనలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆ స్తి పన్ను చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, కమిషనర్‌ రమణాచారి తెలిపారు. మంగళవారం క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా నల్లా బిల్లు చె ల్లించే సౌలభ్యంతో పాటు సమస్యలపై ఫిర్యాదు కూడా చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన అబ్బగోని రమేష్‌, మునిసిపల్‌ ఏసీపీ నా గిరెడ్డి, మేనేజర్‌ పవనకుమార్‌, నాయకులు ఇబ్రహీం, సిబ్బంది పాల్గొన్నారు. 


Read more