పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-05T05:53:24+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రు అనిల్‌, వనం రాజు డిమాండ్‌ చేశారు.

పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి
కలెక్టరటే వద్ద ధర్నా చేస్తున్న ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు

పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ చేయాలి

ఎస్‌ఎ్‌ఫఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి 

యాదాద్రి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రు అనిల్‌, వనం రాజు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు పట్టణం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి నినాదాలు చేశా రు. అనంతరం కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకుండా, ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీచేయకుండా చదువులు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సంవత్సరం ఇంగ్లీష్‌ మీడియం తరగతులు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, సరై న సమయంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు యూనిఫాంలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రిడ్జీ కోర్సుతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల సవతితల్లి ప్రేమ చూపుతోందన్నారు. విద్యార్థులకు కరోనా సోకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడంలేదని, పాఠశాలల్లో కొవిడ్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు చింతల శివ, సందుల రాజేష్‌, లావుడియా రాజు, వేముల నాగరాజు, ఈర్ల రాహుల్‌, సత్తార్‌, మనోజ్‌. తదితరులు పాల్గొన్నారు. 

Read more