పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-02-16T06:02:56+05:30 IST

తమ సమస్య లు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్‌బీసీలో ఉన్న కనగల్‌ గు రుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి
పాఠశాలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు

 నల్లగొండ, ఫిబ్రవరి 15: తమ సమస్య లు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్‌బీసీలో ఉన్న కనగల్‌ గు రుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మంగళవారం పాఠశాలలో భోజనం స రిగ్గా ఉండకపోవడంతో పాటు, ఆలస్యంగా పె డుతున్నారని ఆరోపించారు. అంతేకాక పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ నీటి సరఫరా సక్రమండా లేదని బాత్రూంల్లో నీళ్లు కూడా లేవని ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా  ఉండంతో తీవ్ర దుర్గంధం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీకి వచ్చే స మయంలోనే భోజనం మంచిగా ఉంటుందన్నా రు. ఆ తర్వాత రోజుల్లో భోజనం బాగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం ఉడకడం లేదని, కూరలు, సాంబారు అధ్వానంగా ఉంటున్నాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలని కోరారు. 


Read more