ప్రైవేట్‌ కళాశాల కరస్పాండెంట్‌ మృతి

ABN , First Publish Date - 2022-02-19T07:17:08+05:30 IST

రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ప్రైవేట్‌ కళాశాలల కరస్పాండెంట్‌ పాలబిందెల వీరయ్య (55) మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రైవేట్‌ కళాశాల కరస్పాండెంట్‌ మృతి
వీరయ్య (ఫైల్‌ )

తిరుమలగిరి, ఫిబ్రవరి18: రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ప్రైవేట్‌ కళాశాలల కరస్పాండెంట్‌ పాలబిందెల వీరయ్య (55) మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్‌పై వీరయ్య శుక్రవారం అత్తగారి ఊరైన జనగాం జిల్లా కొడ కండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి వెళ్లారు. మొండ్రాయి గ్రామశివారులో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో  తీవ్రంగా గాయపడిన వీరయ్యను ఆస్పత్రికి తరలిస్తుం డగా మార్గమధ్యలో మృతి చెందారు. వీరయ్య తిరుమలగిరిలో కొన్నేళ్లుగా రాఘవేంద్ర, సరస్వతి ఇంటర్‌, డిగ్రీ ప్రైవేట్‌ కళాశాలల కరస్పాండెంట్‌గా వ్యవహ రిస్తున్నారు. వీరయ్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరయ్య మృతికి పలువురు సంతాపం తెలిపారు. Read more