‘శ్రీవల్లీ’ విక్రయానికి ముమ్మరంగా సన్నాహాలు

ABN , First Publish Date - 2022-02-19T06:17:44+05:30 IST

ప్రభుత్వ ఆధీనంలోని రాజీవ్‌ స్వగృహ (శ్రీవల్లీ టౌన్‌షి్‌ప) ప్లాట్ల విక్రయానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో అధికార యంత్రాంగం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది.

‘శ్రీవల్లీ’ విక్రయానికి ముమ్మరంగా సన్నాహాలు
ప్రీబిడ్‌ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌

రాజీవ్‌ స్వగృహలో ఓపెన్‌ ప్లాట్ల వేలానికి కసరత్తు

తొలి విడతగా 240 ప్లాట్ల విక్రయం

కలెక్టరేట్‌లో ఫ్రీబిడ్‌ సమావేశం నిర్వహణ

హెల్ప్‌ లైన్‌ నంబరు 18004251442 ఏర్పాటు

వచ్చే నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు వేలం

నల్లగొండ, ఫిబ్రవరి 18: ప్రభుత్వ ఆధీనంలోని రాజీవ్‌ స్వగృహ (శ్రీవల్లీ టౌన్‌షి్‌ప) ప్లాట్ల విక్రయానికి ప్రభుత్వం అనుమతివ్వడంతో అధికార యంత్రాంగం వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. రాజీవ్‌ స్వగృహ పరిధిలోని ఖాళీ ప్లాట్ల విక్రయానికి కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఇప్పటికే షెడ్యూల్‌ జారీచేశారు. నార్కట్‌పల్లి మండలం యల్లారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి పక్కనే రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లీ టౌన్‌షి్‌ప ఉంది. ఈ టౌన్‌షి్‌పలో తొలుత ఖాళీ ప్లాట్లను ఈ ఏడాది మార్చి 14, 15, 16, 17వ తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవనంలో శుక్రవారం ఫ్రీబిడ్‌ సమావేశం నిర్వహించారు. 240 ఖాళీ ప్లాట్లను విక్రయించేందుకు నిర్ణయించగా, షెడ్యూల్‌ ప్రకారం ప్లాట్ల నెంబర్ల వారీగా వేలం నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 7వ తేదీన మళ్లీ ఫ్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ టౌన్‌షి్‌పలో 33 ప్లాట్లను మల్టీపుల్‌ వినియోగానికి లేఅవుట్లు విభజించారు. నీలగిరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఏర్పాటు తర్వాత దీని పరిధిలో మొదటి సారిగా ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో వేలం నిర్వహించనున్నారు. గజానికి రూ.10వేలు చొప్పున ధర నిర్ణయించారు. డీటీసీపీ నిబంధనల మేరకు లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించారు.

‘నుడా’ పరిధిలో తొలిసారిగా

నీలగిరి అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (నుడా)ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం మొదటి సారిగా ప్రభుత్వమే ప్లాట్ల విక్రయానికి నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రీబిడ్‌ సమావేశంలో విధివిధానాలు ప్రకటించారు. ఈ టౌన్‌షి్‌పలో భూ వివాదాలు, తగాదాలు లేవని ఎన్‌కంబారెన్స్‌ ఫ్రీప్లాట్లను సొంత చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. డీటీసీపీ నిబంధనల మేరకు ఈ ప్లాట్లను అభివృద్ధి చేశారు. బ్లాక్‌టాప్‌ రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం, ఇంటర్నల్‌ ఎలక్ట్రిఫికేషన్‌, స్ట్రీట్‌ లైట్లు, తాగునీరు. సీవరేజ్‌ సిస్టమ్‌, అవెన్యూ ప్లాంటేషన్‌ వంటి సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ వేలంలో పాల్గొనాలంటే ఈఎండీ కింద రూ.10వేలను కలెక్టర్‌ పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. రాజీవ్‌ స్వగృహ శ్రీవల్లీ టౌన్‌షి్‌పలో సైట్‌ కార్యాలయం ఓపెన్‌ చేశారు. అందులో లేఔట్‌ మ్యాప్‌, ప్లాట్‌ నెంబర్‌ డిస్‌ప్లే చేశారు. అదేవిధంగా టౌన్‌షి్‌పను సందర్శించే అవకాశం కూడా కల్పించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాజీవ్‌ స్వగృహ కార్యాలయంలో తెలుసుకోవచ్చు. వివరాలకు సెల్‌ నంబర్‌ 9154339209లో సంప్రదించవచ్చు. అదేవిధంగా కలెక్టరేట్‌ కార్యాలయంలో హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 18004251442ను ఏర్పాటు చేశారు.

వేలం ద్వారా ఓపెన్‌ ప్లాట్ల విక్రయం : కలెక్టర్‌

నల్లగొండ: శ్రీవల్లీ టౌన్‌షి్‌పలో ఓపెన్‌ ప్లాట్లను మార్చి 14, 15, 16, 17 తేదీల్లో వేలం ద్వారా విక్రయించనున్నట్టు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలి విడతగా 240 ప్లాట్లను షెడ్యూల్‌ ప్రకారం వేలం వేస్తామన్నారు. మార్చి 7వ తేదీన మరోమారు ప్రీబిడ్‌ సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీటీసీపీ నిబంధనల మేరకు లేఅవుట్‌ను అభివృద్ధి చేశామన్నారు. ఆసక్తి ఉన్నవారు టౌన్‌షి్‌పలోని సైట్‌ కార్యాలయాన్ని సందర్శించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ల్యాండ్‌ సర్వే రికార్డ్స్‌ ఏడీ శ్రీనివా్‌స తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-19T06:17:44+05:30 IST