‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-09-13T05:59:09+05:30 IST

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 20 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్‌
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న వెంకటేశ్‌

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 12 : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 20 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఆలేరు సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనాన్ని అందించాలని ఆల్‌ ఇండియా పేరెంట్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కొడారి వెంకటేశ్‌, తల్లిదండ్రుల సంఘం అధ్యక్షలు తాటికాయల నరేందర్‌, ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్‌, స్వామి, దేవేందర్‌, నర్సింహ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఏవో నాగేశ్వరచారి పాల్గొన్నారు. 

Read more