తాకట్టు నగల వివాదం.. వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-02T05:48:00+05:30 IST

బ్యాంకులో నగలు తాకట్టు విషయంలో ఘర్షణ పడి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పాలకవీడు మండలంలో చోటుచేసుకుంది.

తాకట్టు నగల వివాదం.. వివాహిత ఆత్మహత్య
లక్ష్మి మృతదేహం

పాలకవీడు, అక్టోబరు 1 : బ్యాంకులో నగలు తాకట్టు విషయంలో ఘర్షణ పడి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పాలకవీడు మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సైదులుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రావిపహాడ్‌ గ్రామానికి చెందిన పంతడి శ్రీరాములు, లక్ష్మి(26) దంపతులు గతంలో బ్యాంకులో నగలను తాకట్టు పెట్టారు. ఆ నగలను విడిపించడంలో ఆలస్యమైంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య శుక్రవారం గొడవజరిగింది. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మి భర్త శుక్రవారం చేపలవేటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. లక్ష్మి పెద్దకుమార్తె గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూసే లోపు చనిపోయింది. లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు కాగా, తండ్రి వెంకటరత్నం శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Read more