గుట్టుప్పల మండలం ఏర్పాటుతో తీరిన మొక్కు

ABN , First Publish Date - 2022-10-11T06:45:17+05:30 IST

గట్టుప్పల మండలం ఏర్పాటుతో మండల సాధన సమితి కన్వీనర్‌ ఇడెం కైలాసం సోమవారం తిరుమతిలో తన మొక్కు తీర్చుకున్నారు.

గుట్టుప్పల మండలం ఏర్పాటుతో తీరిన మొక్కు
తిరుమలలో తలనీలాలు సమర్పిస్తున్న ఇడెం కైలాసం

గట్టుప్పల, అక్టోబరు 10: గట్టుప్పల మండలం ఏర్పాటుతో మండల సాధన సమితి కన్వీనర్‌ ఇడెం కైలాసం సోమవారం తిరుమతిలో తన మొక్కు తీర్చుకున్నారు. మండలం సాధించేంత వరకు జుట్టు, గడ్డం తీసేది లేదని ఆయన గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మండలం ఏర్పాటుతోపాటు నూతన కార్యాలయాలు ప్రారంభం కావడంతో తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలో ఆయనతోపాటు మండల సాధన సమితి నాయకుడు బీపీఎల్‌ గౌడ్‌ తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నాడు. వారి వెంట సర్పంచ్‌ ఇడెం రోజా తదితరులు ఉన్నారు.

Read more