పైపులు ధ్వంసమై తాగునీరు కలుషితం

ABN , First Publish Date - 2022-10-11T05:58:06+05:30 IST

మిషన్‌ భగీరథ పైపులు ఽధ్వంసమై ఆ నీరు గ్రామ పంచాయతీ ద్వారా సరఫరా అయ్యే నీటిలో కలిసి కలుషి తమైన తాగునీరు సరఫరా అవుతోందని బీజేపీ మండల అధ్యక్షుడు దున్నా సతీష్‌ అన్నారు.

పైపులు ధ్వంసమై తాగునీరు కలుషితం
పైపులు ధ్వంసమైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు

నడిగూడెం, అక్టోబరు 10: మిషన్‌ భగీరథ పైపులు ఽధ్వంసమై  ఆ నీరు గ్రామ పంచాయతీ ద్వారా సరఫరా అయ్యే నీటిలో కలిసి కలుషి తమైన తాగునీరు సరఫరా అవుతోందని బీజేపీ మండల అధ్యక్షుడు దున్నా సతీష్‌ అన్నారు. నడిగూడెంలోని ప్రధాన రహదారిపై మిషన్‌ భగీరథ పైపులు ధ్వంసమైన పార్టీ నాయకులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పైపులు ధ్వంసమై నెల రోజులు గడి చినా మరమ్మతు చేయించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. కలుషితమైన నీరుతాగి ప్రజలు రోగాల బారిన పడకముందే సమస్యను  ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో లతీఫ్‌, చిన్న కొండయ్య, కోటయ్య, గపూర్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-10-11T05:58:06+05:30 IST