చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి: జడ్జీ రవీందర్‌

ABN , First Publish Date - 2022-11-12T00:15:09+05:30 IST

చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని దేవరకొండ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్‌ అన్నారు.

చట్టాలపై ప్రజలకు అవగాహన ఉండాలి: జడ్జీ రవీందర్‌
హోమంతాలపల్లిలో మాట్లాడుతున్న న్యాయమూర్తి రవీందర్‌

చింతపల్లి / దామరచర్ల, నవంబరు 11 : చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని దేవరకొండ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్‌ అన్నారు. జాతీయ న్యాయసేవా వారోత్సవాలలో భాగంగా శుక్రవారం మండలంలోని హోమంతాలపల్లి గ్రామంలో నిర్వహించిన లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు చేరువలో న్యాయసేవలు అందేలా చూడడం కోసమే లోక్‌ అదాలత్‌లను ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రమేష్‌, దేవరకొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమాశంకర్‌, సర్పంచ్‌ పెద్దిరాజు, న్యాయవాదులు, నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మిర్యాలగూడ 5వ అదనపు న్యాయమూర్తి రఘునాథరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి దీప్తి, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జీ మాధవి, సర్పంచ్‌ కొందూటి మాధవి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:15:09+05:30 IST

Read more