కాంగ్రెస్‌, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం

ABN , First Publish Date - 2022-09-08T06:32:34+05:30 IST

మునుగోడులో కాంగ్రెస్‌, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభసభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం
పార్టీలోకి ఆహ్వనిస్తున్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌

చౌటుప్పల్‌ టౌన్‌, సెప్టెంబరు 7: మునుగోడులో కాంగ్రెస్‌, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభసభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. చౌటుప్పల్‌ పట్టణంలోని 7, 18 వార్డులకు చెందిన పలువురు యువకులు, మహిళలు బుధవారం ఎంపీ లింగయ్యయాదవ్‌ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఏశక్తి ఆపలేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్‌.భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌ రెడ్డి, షాదీఖాన చైర్మన్‌ ఎండీ ఖలీల్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

Read more