వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలి: దయాకర్‌

ABN , First Publish Date - 2022-08-02T05:20:45+05:30 IST

వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కాం గ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిదవ

వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేయాలి: దయాకర్‌
అర్వపల్లిలో వీఆర్‌ఏలకు మద్దతు తెలుపుతున్న అద్దంకి దయాకర్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కాం గ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిదవ రోజు వీఆర్‌ఏల రిలేదీక్ష కొనసాగుతున్నాయి. అర్వపల్లిలోని తహసీల్ధార్‌ కార్యాలయం వద్ద సోమవారం వంటా వార్పు నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ వీఆర్‌ఏలకు వారసత్వఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందంటే సీఎం కేసీఆర్‌ పాలనకు నిదర్శనమన్నారు. సూర్యాపేటలో వీఆర్‌ఏలకు ప్రజావాణి రాష్ట్ర అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు, వీఆర్‌ఏ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మీసాల సునీల్‌గవాస్కర్‌లు దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతగిరిలో వీఆర్‌ఏల దీక్షలకు వీఆర్‌వోలు మద్దతు ప్రకటించారు.నడిగూడెంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్‌కె లతీఫ్‌,  రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యానారాయణ  దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. వీరికి ఐఎన్‌టీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. మునగాలలో వీఆర్‌ఏల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గట్టు ఉపేందర్‌రావు, ఉపాధ్యక్షులుగా నూకబత్తిని నర్సయ్య, లంజపల్లి వెంకన్న, కోశాధికారిగా ఎస్‌కె జానీపాషాలతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పేస్కేల్‌ ఇవ్వాలని తెలంగాణ తల్లిని కోరుకుంటూ వినూత్న నిరసన తెలిపారు. మద్దిరాల, తుంగతుర్తిలలో వంటావార్పు నిర్వహించారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయ కులు నాగమల్లయ్య, మధు, ఆమ్‌ఆద్మీ పార్టీ మండల కన్వీనర్‌ తన్నీరు వెంకన్న వీఆర్‌ఏల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. 

Updated Date - 2022-08-02T05:20:45+05:30 IST