ఓట్లు బిచ్చమెత్తుకుంటున్న పార్టీలు

ABN , First Publish Date - 2022-09-19T06:08:59+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాటం పేరు చెప్పుకొని కొన్ని పార్టీలు నేడు ఓట్ల కోసం బిచ్చమెత్తుకుంటున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ అన్నారు. ఆదివారం ఆలేరులో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఓట్లు బిచ్చమెత్తుకుంటున్న పార్టీలు
ఆలేరులోని తెలంగాణ సాయుధ పోరాట యోధుల స్మారక స్తూపం వద్ద నివాళి అర్పిస్తున్న సీపీఎం నాయకులు

సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌ 

ఆలేరు, సెప్టెంబరు 18: తెలంగాణ సాయుధ పోరాటం పేరు చెప్పుకొని కొన్ని పార్టీలు నేడు ఓట్ల కోసం బిచ్చమెత్తుకుంటున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ అన్నారు. ఆదివారం ఆలేరులో సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ పోరాటాలకు దిక్సూచిగా నిలిచిందన్నారు. వందల సంవత్సరాలుగా  బానిసత్వంలో మగ్గిన తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపి సాయుధ పోరాటం నడిపించి నిజాంను మట్టికరిపించి న మహోజ్వల పోరాటంగా అభివర్ణించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు మాటూరి బాల్‌రాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, ఎంఏ ఇక్బాల్‌, మండల నాయకులు మొరిగాడి రమేష్‌, చంద్రశేఖర్‌, సీస రవి, గనగాని మల్లేశం, తాళ్లపల్లి గణేష్‌, జూకంటి పౌల్‌, తులసయ్య, విప్లవ్‌ గణేష్‌, నవీన్‌, వడ్డెమాన్‌ బాల్‌రాజ్‌, పరుశరాం పలువురు పాల్గొన్నారు.

Read more