పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి

ABN , First Publish Date - 2022-06-07T06:32:06+05:30 IST

పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తేనే సత్ప్రవర్తనతో ఉంటారని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌ కళా జాత ఆధ్వర్యంలో కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు ట్రాఫిక్‌ నియమబంధనలు, బాల్య వివాహాలపై వచ్చే ఇబ్బందులపై ఆదివారం రాత్రి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి

కోదాడ టౌన్‌, జూన్‌ 6: పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ వహిస్తేనే సత్ప్రవర్తనతో ఉంటారని డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. పోలీస్‌ కళా జాత ఆధ్వర్యంలో కోదాడలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు ట్రాఫిక్‌ నియమబంధనలు, బాల్య వివాహాలపై వచ్చే ఇబ్బందులపై ఆదివారం రాత్రి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆకర్షణకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలన్నారు. 18 ఏళ్ల నిండిన వారికే డ్రైవింగ్‌, సెల్‌ఫోన్‌ వినియో గంపై అవగాహన ఉంటుందన్నారు. బాలికలు, యువతులు ఆపత్కా లంలో  1098కు ఫోన్‌ చేయాలని సూచించారు. సమావేశంలో పట్టణ సీఐలు ఎ.నర్సింహారావు, నాగదుర్గాప్రసాద్‌, ఎస్‌ఐలు రాంబాబు, నరేష్‌, సురేష్‌, సీడీపీవో అనంతలక్ష్మి, పద్మ, నాగుల్‌మీరా, మల్లేష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-06-07T06:32:06+05:30 IST