ఒక్కరోజే లక్ష మొక్కలు నాటాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-11-16T00:42:15+05:30 IST

నల్లగొండ జిల్లాకేంద్రంలో ఈ నెల 19వ తేదీన లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు.

ఒక్కరోజే లక్ష మొక్కలు నాటాలి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

నల్లగొండ టౌన్‌/రామగిరి, నవంబరు 15: నల్లగొండ జిల్లాకేంద్రంలో ఈ నెల 19వ తేదీన లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ టి. వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. నల్లగొండ మునిసిపల్‌ సమావేశ మందిరంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంపై మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన నల్లగొండ జిలా ్లకేంద్రంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి వోఎ్‌సడీ ప్రియాంక వర్గిస్‌ హాజరవుతారని తెలిపారు. పట్టణ శివారులోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. లక్ష మొక్కల్లో 60వేలు హెచ్‌ఎండీఏ నుంచి మరో 40వేల మొక్కలు ములుగు జిల్లా నుంచి తెస్తా రని తెలిపారు. జిల్లాకేంద్రంలో లక్ష మొక్కలు మొక్కలు నాటే కార్యక్రమానికి 10 మంది స్పెషల్‌ ఆఫీసర్లు, 17మంది సూపర్‌వైజర్లను నియమించినట్లు తెలిపారు. మరో 70మంది అధికారులను అదనంగా నియమించినట్లు తెలిపారు. సమావేశంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమే్‌షగౌడ్‌, కమిషనర్‌ డాక్టర్‌ కేవీ. రమణాచారి, జిల్లా పరిషత్‌ సీఈవో ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఎఫ్‌వో రాంబాబు, డీఈవో భిక్షపతి, మహిళా సంక్షేమ శాఖ అధికారి సుభద్ర, సీడీపీవో నిర్మల, ఎస్సీ వెల్‌ఫేర్‌ అధికారి సల్మాభాను, బీసీ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ పుష్పలత, పర్యావరణ అధికారి సురే్‌షబాబు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-16T00:42:15+05:30 IST

Read more