వైభవంగా నృసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-04-10T06:24:31+05:30 IST

రెండో యాదగిరిగుట్టగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో స్వామి వారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శనివారం శాస్రోక్తంగా నిర్వహించారు.

వైభవంగా నృసింహుడి కల్యాణం
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు


మఠంపల్లి, ఏప్రిల్‌ 9: రెండో యాదగిరిగుట్టగా పేరొందిన మట్టపల్లి లక్ష్మీనృసింహుడి క్షేత్రంలో స్వామి వారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శనివారం శాస్రోక్తంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్సేన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాసన అనంతరం మాంగల్యధారణ, తలంబ్రాల తంతు నిర్వహించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, చెన్నూరి విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మీనరసింహమూర్తి, సీతారామశాస్ర్తీ, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Read more