దళితబంధు కాదు, ఎమ్మెల్యేల ఇంటిబంధు

ABN , First Publish Date - 2022-10-09T05:29:30+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల అభివృద్ధికోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎమ్మెల్యేల ఇంటిబంధుగా మారందని టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా్‌సమాదిగ ఆరోపించారు.

దళితబంధు కాదు, ఎమ్మెల్యేల ఇంటిబంధు
సమావేశంలో మాట్లాడుతున్న వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ

టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా్‌సమాదిగ

యాదగిరిగుట్ట రూరల్‌, అక్టోబరు 8: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల అభివృద్ధికోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎమ్మెల్యేల ఇంటిబంధుగా మారందని టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివా్‌సమాదిగ ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో శనివారం ఆలేరు నియోజకవర్గస్థాయి టీఎమ్మార్పీఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడిచినా మాదిగలు సహజసంపదకు దూరమై ఆర్థిక, రాజకీయ వివక్షకు గురవుతూనే ఉన్నారన్నారు. వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ దళితబంధు ప్రవేశపెడితే దళితులకు అందకుండా ఎమ్మెల్యేలు కలగజేసుకోవడంతో దళితులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో ఉన్న సహజసంపదలు దామాషా ప్రకారం దళితులకు దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. హక్కుల సాధనకోసం ఈ నెల 11, 12 తేదీల్లో తహసీల్దార్‌, ఎంపీడీవో, 17, 18 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ నెల 28న హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే దండోరా మహాధర్నాలో అధికసంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకటేష్‌, టీఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రంగాపురం స్వామి, జిల్లా అధ్యక్షుడు కుర్రెల రమేష్‌, బొట్ట శ్రీనివాస్‌, నాగరాజు, గుర్రం మహేందర్‌, మీసాల ఉప్పలయ్య, చింత శంకర్‌, బూసి మహేష్‌, వడ్లకొండ శ్రీకాంత్‌, ఎర్ర విజయ్‌, దర్శనం స్వామి, సుదర్శనం, సాయికుమార్‌, భాను, మధు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-09T05:29:30+05:30 IST