నీలగిరికి సొబగులు

ABN , First Publish Date - 2022-06-11T06:45:26+05:30 IST

నీలగిరికి సరికొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌ పర్యటన సమయంలో నల్లగొండ పట్టణ రూపురేఖలు మార్చేందుకు పలు సూచనలు చేశారు.

నీలగిరికి సొబగులు
నల్లగొండ పట్టణ శివారులోని చర్లపల్లి బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన వెల్‌కమ్‌ నల్లగొండ బోర్డు

రామగిరి, జూన్‌ 10: నీలగిరికి సరికొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌ పర్యటన సమయంలో నల్లగొండ పట్టణ రూపురేఖలు మార్చేందుకు పలు సూచనలు చేశారు. సుమారు రూ.400 కోట్ల ఖర్చుతో రోడ్ల విస్తరణ, కళాభారతి, శిల్పారామం, ఉదయసముద్రం, వల్లభరావు చెరువు అభివృద్ధి పనులకు ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌ కార్యాలయ నిర్మాణం, చర్లపల్లి అర్బన్‌ పార్కు, ఎన్జీ కళాశాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. దీంతో సంబంధింత పనుల్లో వేగం పెంచారు. పట్టణ శివారు చర్లపల్లి బైపాస్‌ వద్ద వెల్‌కమ్‌ బోర్డు, ఆర్చ్‌లు, పాదచారుల వంతెనలు, పట్టణంలో ఏడు జంక్షన్ల అభివృ ద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. రహదారుల విస్తరణ పనులు కొనసాగుతుండగా, మర్రిగూడ బైపాస్‌ జంక్షన్‌ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. క్లాక్‌టవర్‌ జంక్షన్‌ పనులు 50 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఇంకో నెల రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడు, అంబేడ్కర్‌, సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాలు, అశోకచక్రంతోపాటు ప్రధాన రహదారి డివైడర్‌లో పచ్చదనం ఉండేవిధంగా మొక్కలు, బ టర్‌ఫ్లై లైట్లతో నల్లగొండ నూతన శోభను సంతరించుకోనుంది. క్లాక్‌టవర్‌ జంక్షన్‌లో జరుగుతున్న పనులు, రహదారి విస్తరణ పూర్తయితే నల్లగొండ రూపూరేఖలే మారనున్నాయి.    

Updated Date - 2022-06-11T06:45:26+05:30 IST