బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌గా నారాయణరావు

ABN , First Publish Date - 2022-11-17T00:41:29+05:30 IST

: కోదాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌గా కనగాల నారాయణరావును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ బండి అంజయ్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.

బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌గా నారాయణరావు
నారాయణరావు

కోదాడటౌన్‌, నవంబరు 16: కోదాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌గా కనగాల నారాయణరావును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీ బండి అంజయ్‌ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. కనగాల నారాయణరావు 35 ఏళ్లుగా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ యువమోర్చా, బీజేపీ మండల అధ్యక్షుడిగా, కిసాన్‌ మోర్చా కార్యదర్శిగా పని చేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. తనను ఎంపిక చేసిన బండి సంజయ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-11-17T00:41:29+05:30 IST

Read more