ఉద్యమానికి నల్లగొండ కేంద్ర బిందువు

ABN , First Publish Date - 2022-12-30T00:48:44+05:30 IST

గ్రంథాలయ ఉద్యమానికి నల్లగొండ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచిందని గ్రంథాలయ పరిషత్‌ రాష్ట్ర చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంఽథాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. వట్టికోట ఆళ్వారుస్వామి వారసత్వంతో గ్రామ, గ్రామాన గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయన్నారు.

ఉద్యమానికి నల్లగొండ కేంద్ర బిందువు

గ్రంథాలయ పరిషత్‌ రాష్ట్ర చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌

నల్లగొండ కల్చరల్‌, డిసెంబరు 29: గ్రంథాలయ ఉద్యమానికి నల్లగొండ జిల్లా కేంద్ర బిందువుగా నిలిచిందని గ్రంథాలయ పరిషత్‌ రాష్ట్ర చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్ర గ్రంఽథాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. వట్టికోట ఆళ్వారుస్వామి వారసత్వంతో గ్రామ, గ్రామాన గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న నల్లగొండ మోడల్‌ గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో రాష్ట్రంలో గ్రంథాలయాలకు నూతన భవనాలు సమకూరుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్‌ జిల్లా చైర్మన్‌ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, కార్యదర్శి బి.బాలమ్మ, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:48:44+05:30 IST

Read more