By Election: నవంబర్ 2వ వారంలో మునుగోడు ఉపఎన్నిక?

ABN , First Publish Date - 2022-09-29T20:52:42+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు.

By Election: నవంబర్ 2వ వారంలో మునుగోడు ఉపఎన్నిక?

హైదరాబాద్ (Hyderabad): మునుగోడు (Munugodu) ఉప ఎన్నికల (By Election) నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర అధికారులు కసరత్తు చేస్తున్నారు. నవంబర్ 2వ వారంలో మునుగోడు ఉపఎన్నిక జరగనున్నట్లు సమాచారం. దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ (Notification) వెలువడనున్నట్లు తెలియవచ్చింది. మునుగోడు ఉప ఎన్నికకు ఈవీఎం (EVM)లతో పాటు అవసరమైన ఏర్పాట్లు ఈసీ చేస్తోంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఈసీఐ (ECI) ఆదేశించింది. దీంతో నల్గొండ జిల్లా కలెక్టర్, అధికారులు ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు.

Read more