స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు అందుకున్న నేరేడుచర్ల మునిసిపల్‌ చైర్మన్‌

ABN , First Publish Date - 2022-10-02T05:50:45+05:30 IST

భారతదేశ వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాతీయ అవార్డుకు నేరేడుచర్ల మునిసిపాలిటీ ఎంపికైంది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు అందుకున్న నేరేడుచర్ల మునిసిపల్‌ చైర్మన్‌
కేంద్ర మంత్రుల నుంచి అవార్డులు అందుకుంటున్న నేరేడుచర్ల మునిసిపల్‌ కమిషనర్‌, చైర్మన్‌

నేరేడుచర్ల, అక్టోబరు 1: భారతదేశ వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాతీయ అవార్డుకు నేరేడుచర్ల మునిసిపాలిటీ ఎంపికైంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో నేరేడుచర్ల మునిసిపల్‌ చైర్మన్‌ చందమళ్ల జయబాబు, కమిషనర్‌ వెంకటేశ్వర్లు కేంద్ర మంత్రులు కౌశల్‌ కిషోర్‌, మనోజ్‌ జ్యోష్‌ నుంచి అవార్డులను అందుకున్నారు. 


Read more