పే స్కేలు సాధించే వరకు ఉద్యమం

ABN , First Publish Date - 2022-08-18T05:14:27+05:30 IST

పే స్కేలు జీవో సాధించే వరకు ఉద్యమం ఆగదని వీఆర్‌ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం హెచ్చరించారు.

పే స్కేలు సాధించే వరకు ఉద్యమం
ఆర్డీవో ఎంవీ.భూపాల్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న మల్లేశం, వీఆర్‌ఏలు

 వీఆర్‌ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం 

  ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించిన వీఆర్‌ఏలు

భువనగిరి రూరల్‌, ఆగస్టు 17: పే స్కేలు జీవో సాధించే వరకు ఉద్యమం ఆగదని వీఆర్‌ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కల్లూరి మల్లేశం హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వీఆర్‌ఏలు ప్రజా సంఘాల మద్దతుతో బుధవారం స్థానిక పాత బస్టాండ్‌ నుంచి వినాయక చౌరస్తా, బాబు జగ్జీవన రామ్‌ చౌరస్తా, జగదేవ్‌పూర్‌ చౌరస్తా మీదుగా ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఇప్పటి వరకు హామీ నెరవేర్చకపోవడం సరికాదన్నారు. అర్హులైన వీఆర్‌ఏలకు ప్రమోషన్లు కల్పించి వారసత్వ ఉద్యోగాలు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అనంతరం ఆర్డీవో ఎంవీ.భూపాల్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వీఆర్‌ఏల జేఏసీ జనరల్‌ సెక్రటరి గోరుకంటి వెంకటేశం, చైర్మన దాసరి వీరన్న, పసుల రమేశ, చింతల పెంటయ్య, గిరి, గడ్డం శ్రీను, నగేశ, ఆంజనేయులు, దశరథ, మాధవి, ధనలక్ష్మీ, కుమార్‌, అర్జున, లక్ష్మయ్య, వెంకటేశం, సైదులు, భాస్కర్‌, జగన పాల్గొన్నారు. 

Read more