కొబ్బరికాయల సంచుల్లో గంజాయి తరలింపు

ABN , First Publish Date - 2022-10-04T05:46:24+05:30 IST

కొబ్బరికాయ సంచుల మధ్యన భారీగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని ఎస్‌వోటీ, సివిల్‌ పోలీసులు పట్టుకున్నారు.

కొబ్బరికాయల సంచుల్లో గంజాయి తరలింపు
పట్టుబడిన గంజాయిని తూకం వేస్తున్న పోలీసులు

రూ.2కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఘటన

ఆలేరు, అక్టోబరు 3: కొబ్బరికాయ సంచుల మధ్యన భారీగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని ఎస్‌వోటీ, సివిల్‌ పోలీసులు పట్టుకున్నారు. యా దాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని 163వ జాతీయ రహదారిపై సోమవారం ఈ సంఘటన జరిగింది. ఆలేరు ఎస్‌ఐ ఇద్రిస్‌అలీ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్ర మంగా తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆలే రులో జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. మహా రాష్ట్రకు చెందిన ఎంహెచ్‌ 14 సీపీ 8698 నెంబరు గల డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా, కొబ్బరి కాయల బస్తాల మధ్యలో భారీ ఎత్తున 900కిలోల గంజాయిని గుర్తించారు. డ్రైవర్‌ను, అందులో ఉన్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల్లో ముగ్గురు మహారాష్ట్రకు చెందిన వారు ఉండగా, ఒకరు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామని ఎస్‌ఐ తెలిపారు.

Read more