మదర్‌ డెయిరీ ఎన్నికలపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-09-24T06:12:54+05:30 IST

ఉత్కంఠ రేపుతున్న నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్‌ (నార్మూల్‌-మదర్‌డెయిరీ) డైరెక్టర్ల ఎన్నిక, చైర్మన్‌ పీఠం ఎవరికి అనేది తుది దశకు చేరుకుంది. డైరెక్టర్ల ఎన్నిక గతంలో అనేకమార్లు ఏకగ్రీవమైంది.

మదర్‌ డెయిరీ ఎన్నికలపై ఉత్కంఠ
డైరెక్టర్ల ఎన్నిక బ్యాలెట్‌ పత్రం

మూడు స్థానాలకు అధికార పార్టీ నుంచి ముగ్గురు

పోటీకి సిద్ధమైన కాంగ్రెస్‌, బీజేపీ సానుభూతిపరులు

ఓటర్లను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు

27న పోలింగ్‌, 28న చైర్మన్‌ ఎన్నికనల్లగొండ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉత్కంఠ రేపుతున్న నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్‌ (నార్మూల్‌-మదర్‌డెయిరీ) డైరెక్టర్ల ఎన్నిక, చైర్మన్‌ పీఠం ఎవరికి అనేది తుది దశకు చేరుకుంది. డైరెక్టర్ల ఎన్నిక గతంలో అనేకమార్లు ఏకగ్రీవమైంది. అ యితే ఈసారి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రె డ్డి, బీజేపీ నేతలు రాజీకి ససేమిరా అనడంతో ఎన్నిక అనివార్యమైంది. మూడు డైరెక్టర్ల పదవులకు 14 మం ది నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీ నేతలు తమ ప్రాంతంలోని ఆశావహులకు భవిష్యత్తుకు భరో సా ఇచ్చి విరమింపజేశారు. మూడు స్థానాలకు ముగ్గు రు డైరెక్టర్లను అధికార పార్టీ నుంచి బరిలో దించాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పోటీకి సై అనడంతో ఎన్నిక, క్యాంపుల నిర్వహణ అనివార్యమైంది. అధికార పార్టీ నుంచి కస్తూరి పాండు, గొల్లపల్లి రాం రెడ్డి, మందడి ప్రభాకర్‌రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్‌ నుంచి బత్తుల నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి శీలం వెంకటనర్సింహారెడ్డి నిలిచారు. విపక్ష పార్టీలకు చెందిన ఆశావహులను పోటీ నుంచి విరమింపజేసేందుకు డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోటీలో ఉండాల్సిందేనని భువనగిరి ఎంపీ వెంకట్‌రెడ్డి సూచించడంతో ఎన్నికను ఎదుర్కోవడం నరేందర్‌రెడ్డికి అనివార్యమైం ది. డైరెక్టర్లు, చైర్మన్‌ పదవికి అధికార పార్టీలో చాలా మంది పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే సైతం తమ ని యోజకవర్గానికి అంటే తమ నియోజకవర్గానికే అం టూ పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అధికార పార్టీలో అసమ్మతి రేగినా అది తమకు కలిసొ చ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కాంగ్రెస్‌, బీజే పీ సానుభూతిపరులు బరిలో ఉన్నట్లు సమాచారం.


ఆలేరు నియోజకవర్గానికే చైర్మన్‌ పదవి

మదర్‌ డెయిరీలో అత్యధిక సంఖ్యలో ఓటర్లతో పా టు పాల సేకరణ కేంద్రాలు అధికంగా ఉన్న ఆలేరు ని యోజకవర్గానికి ఈ దఫా చైర్మన్‌ పదవి ఇవ్వాలని టీ ఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. గతంలోనే ఈచైర్మన్‌ స్థానం కోసం డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సునీత అధిష్ఠానం వద్ద ప్రయత్నించినా నిరాశే మిగిలింది. తాజా ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గానికి చెందిన డైరెక్టర్లలో కస్తూరి పాండు లేదా గొల్లపల్లి రాంరెడ్డికి చైర్మన్‌గా అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ముందుగా అధికార పార్టీకి చెందిన డైరెక్టర్లను గెలిపించుకుని, ఆ తర్వాత చైర్మన్‌ ఎన్నికపై దృష్టిపెట్టాలని, ముందే చైర్మన్‌ ఎవరనేది చర్చ ప్రారంభిస్తే చీలికలు వస్తాయని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు.


చైర్మన్‌ స్థానానికి భారీగా ఆశావహులు

మదర్‌ డెయిరీలో మొత్తం 15 మంది డైరెక్టర్లు ఉం టారు. తాజాగా మూడు ఖాళీ కావడంతో వాటికి ఈనె ల 27న ఎన్నిక జరగనుంది. అంతా సవ్యంగా సాగి అధికార పార్టీలో అసమ్మతి ఛాయలు లేకపోతే ఆ మూడు స్థానాలు అధికార పార్టీ గెలుచుకోవడం ఖా యం. అయితే చైర్మన్‌ స్థానం ఆలేరు నియోజకవర్గాని కే ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినా, అక్కడి నుంచి ప్రస్తుతం డైరెక్టర్లుగా కొనసాగుతున్న దొంతి సోమిరెడ్డి, కందాల అలివేలు, లింగాల శ్రీకర్‌రెడ్డి, అరకాల గాల్‌రెడ్డి ఉండగా, తాజాగా గొల్లపల్లి రాంరెడ్డి పోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఈ ఐదుగురిలో స్థానిక ఎమ్మెల్యే ఎవరివైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.


గంగుల ఔట్‌

మరోసారి తానే చైర్మన్‌ అని, అధిష్ఠానం ఆ మేరకు హామీ ఇచ్చిందంటూ తాజా మాజీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి మొన్నటి వరకు ప్రచారం చేసుకున్నారు. అయితే ఆయనకు చివరి నిమిషంలో అధికార పార్టీ నుంచే చుక్కెదురైంది. నకిరేకల్‌ ఎమ్మెల్యే విముఖత చూపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కృష్ణారెడ్డి తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మరోసారి పదవికోసం గుత్తా జితేందర్‌రెడ్డి ప్రయత్నించినా ఆలేరుకు కేటాయించనుండటంతో ఆయన తప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మదర్‌ డెయిరీ చైర్మన్‌ ఎన్నికను ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని అధికార పార్టీ పెద్దలు నిర్ణయించారు.


కాం్యపునకు ఓటర్లు

డైరెక్టర్ల ఎన్నిక ఈనెల 27న ఉండగా, పోటీ తప్పని పరిస్థితి నెలకొనడంతో ఓటర్లను క్యాంపునకు తరలించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు ప్రారంభించారు. మదర్‌ డెయిరీలో మొత్తం 286 మంది ఓటర్లు ఉండగా, మూడు డైరెక్టర్ల స్థానాలకు ఖాళీలు ఏర్పడడంతో ప్రతీ ఓటరు మూడు ఓట్లు వేయాల్సి ఉంటుంది. డైరెక్టర్లు, చైర్మన్‌ ఎన్నిక బాధ్యతను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం గొంగిడి మహేందర్‌రెడ్డికి అప్పగించడంతో నామినేషన్ల మొదలు ఈనెల 23న పోటీదారుల విరమణ, క్యాంపు ఏర్పాట్లను చూస్తూ ఆయన మదర్‌ డెయిరీ కేంద్రంలోనే ఉన్నారు. ఆయనతో పాటు మాజీ చైర్మన్‌ గంగుల కృష్ణారెడ్డి సైతం ఉన్నారు. ఈనెల 27న డైరెక్టర్ల ఎన్నిక ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించనున్నారు. డైరెక్టర్ల ఎన్నిక తదుపరి వీలైతే అదేరోజు చైర్మన్‌ ఎన్నిక, లేదంటే 28న నిర్వహించే అవకాశం ఉంది. 

Read more