ఒక్క పైసా ఇవ్వని మోదీ కేసీఆర్‌పై విషం కక్కారు

ABN , First Publish Date - 2022-07-05T05:57:45+05:30 IST

రాష్ట్ర అభివృద్ధికి ఒక్క పైసా విడుదల చేయాని ప్రధాని మోదీ హైదరాబాద్‌కు కేంద్ర మంత్రులు, బలగాలతో వచ్చి సీఎం కేసీఆర్‌పై విషం కక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు.

ఒక్క పైసా ఇవ్వని మోదీ కేసీఆర్‌పై విషం కక్కారు
భాధిత కుటుంబాలకు చెక్‌లు అందిస్తున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

కేంద్రం తీరుతోనే నెల రోజులుగా మిల్లులు బంద్‌

మంత్రి జగదీ్‌షరెడ్డి 

నకిరేకల్‌, జూలై 4: రాష్ట్ర అభివృద్ధికి ఒక్క పైసా విడుదల చేయాని ప్రధాని మోదీ హైదరాబాద్‌కు కేంద్ర మంత్రులు, బలగాలతో వచ్చి సీఎం కేసీఆర్‌పై విషం కక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం వల్లభాపురం గ్రామంలో సోమవారం దళితబం ధు ఆస్తుల పంపిణీ అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ఎనిమిదేళ్ల పాటు అధికారంలో ఉన్న మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి కొనుగోలు చేశారన్నారు. కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో నెల రోజులుగా రైస్‌ మిల్లలు మూతపడ్డాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్నది ఒక్క తెలంగాణలోనే అన్నారు. గుజరాత్‌ను ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్న మోదీ అక్కడ 24 గంటల కరెంట్‌ ఇందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని చేసి ఓర్వలేకే కేసీఆర్‌ను గద్దె దించాలని బీజేపీ కుట్ర చేస్తోందన్నారు.

కార్యకర్తలే పార్టీకి పునాది

సూర్యాపేట(కలెక్టరేట్‌): పార్టీ కార్యకర్తలే టీఆర్‌ఎస్‌ పార్టీకి పునాదులని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఇటీవల మృతిచెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు సోమవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఇన్సురెన్స్‌ చెక్‌లను అందజేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ, ప్రతీ కార్యకర్త ఇంటికి పెద్ద దిక్కులా సీఎం కేసీఆర్‌ ఉంటారన్నారు. కార్యకర్తల కోసం పార్టీ ఏటా రూ.18కోట్లను ఇన్సురెన్స్‌ కంపెనీకి చెల్లిస్తోందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత, ఎంపీపీలు నెమ్మాది భిక్షం, బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ పుట్టా కిశోర్‌కుమా ర్‌, నాయకులు మారిపెద్ది శ్రీనివా్‌సగౌడ్‌, అన్నెపర్తి రాజేష్‌, కుంభం రాజేందర్‌, జహీర్‌, రామగిరి నగేష్‌, గుండపనేని కిరణ్‌, చింతలపాటి మధు, మామిడి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more