ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్‌

ABN , First Publish Date - 2022-10-08T06:16:58+05:30 IST

ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్‌ వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలతో పాటు సేవ లు

ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్‌
పెట్రోల్‌ బంక్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

ఆన్‌లైన్‌ ద్వారా పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన డీజీపీ

కోదాడ, అక్టోబరు 7 : ప్రజల మద్దతుతో ఆధునిక పోలీసింగ్‌ వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శాంతిభద్రతలతో పాటు సేవ లు అందించటమే తమ శాఖ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సహకారంతో ఏర్పాటుచేసిన పోలీస్‌ పెట్రోల్‌ బంక్‌ను ఆన్‌లైన్‌ ద్వారా ఆయన శుక్రవారం ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్‌లో భాగంగా నాణ్యమైన పెట్రోల్‌ను వినియోగదారులకు అందించాల నే లక్ష్యంతో బంక్‌ను ఏర్పాటుచేశామన్నారు. భారత పెట్రోలియం. హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థ వారి తో కలిసి బంక్‌లను నెలకొల్పుతున్నామన్నారు. రాను న్న రోజుల్లో కన్వెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గృహనిర్మాణా లు, వ్యక్తిగత రుణాలు, పిల్లలు చదువులు, వివాహ అవసరాలకు మార్కెట్‌లో వడ్డీ రేటు కన్నా తక్కువ వడ్డీలకు ఆర్థిక సహాయం అందజేస్తామని వివరించా రు. రాష్ట్ర పోలీస్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ ద్వారా పెళ్లి మండపాలను నెలకొల్పుతామని, ఇప్పటికే సీనియర్‌అధికారులతో కమిటీ వేశామని, అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. సీఎం చొరవతో అనుమతి వచ్చేలా ట్యాక్స్‌ వెసులుబాటు ఉండేలా చర్యలు తీసుకొని అన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలకు వేగవంతమైన పోలీస్‌ సేవలు అందిస్తున్నామన్నారు. డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే సిబ్బందికి అన్ని సహకారాలు అందించటంతో పాటు ప్రజలకు మెరుగైన సాంకేతిక సేవలు అందించి భద్రత సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. వినియోగదారులు పోలీస్‌ వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోదాడలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, నాగభూషణం, ఆర్డీవో కిషోర్‌కుమార్‌, ఇందన సంస్థ అధికారులు సిద్ధార్థ, శ్రీనివాస్‌, సీఐ శివశంకర్‌, ఆంజనేయులు, ప్రసాద్‌, ఎస్‌ఐలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T06:16:58+05:30 IST