నేపాల్‌ యువకుడికి ఎమ్మెల్యే చేయూత

ABN , First Publish Date - 2022-09-29T06:25:44+05:30 IST

బతుకుదెరువు కోసం నేపాల్‌ నుంచి నల్లగొండకు వచ్చి టీ కొట్టు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఓ యువకుడి కుటుంబానికి శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి చేయూతనందించారు.

నేపాల్‌ యువకుడికి ఎమ్మెల్యే చేయూత
ఆర్థికసాయం అందజేస్తున్న ఎమ్మెల్యే

నల్లగొండ టౌన, సెప్టెంబరు 28: బతుకుదెరువు కోసం నేపాల్‌ నుంచి నల్లగొండకు వచ్చి టీ కొట్టు నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఓ యువకుడి కుటుంబానికి శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి చేయూతనందించారు. వారం రోజుల క్రితం సదరు యువకుడి భార్యకు డెంగ్యూ రావడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ రూ.1.20 లక్షలు ఖర్చు చేశాడు. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో చేసేదేమీ లేక స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. అప్పటికే ప్లేట్‌లెట్స్‌ తగ్గి ఇనఫెక్షన రావడంతో బుధవారం తెల్లవారుజామున ఆమె మృతి చెం దింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వెంటనే స్పందించి సదరు కు టుంబానికి రూ.20వేల ఆర్థిక సహాయాన్ని అందించి మునిసిపల్‌ అధికారులతో మా ట్లాడి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మునిసిపల్‌ చైర్మన మం దడి సైదిరెడ్డి సైతం రూ.10వేలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో వార్డు ఇనచార్జి వీరమల్ల భాస్కర్‌, మల్లయ్య, జానీ, రామాచారి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Read more