మిషన భగీరథ నల్లాలు చోరీ

ABN , First Publish Date - 2022-09-17T06:18:29+05:30 IST

మోత్కూరు పట్టణంలో గురువారం రాత్రి మెయినరోడ్డు వెంట ఉన్న మిషన భగీరథ నల్లాలు చోరీకి గురయ్యాయి.

మిషన భగీరథ నల్లాలు చోరీ
మోత్కూరు, సెప్టెంబరు 16: మోత్కూరు పట్టణంలో గురువారం రాత్రి మెయినరోడ్డు వెంట ఉన్న మిషన భగీరథ నల్లాలు చోరీకి గురయ్యాయి. మెయినరోడ్డు వెంట ఉన్న దుకాణాల యజమానులకు దుకాణాల ముందే మిషన భగీరథ నల్లాలు బిగించారు. కొందరు ఇంటి ముందే సంపు నిర్మించుకుని మిషన భగీరథ నల్లా పెట్టుకోగా మరికొందరు ఇంటి ముందు నల్లా పెట్టించుకుని నీరు వచ్చినప్పుడు పట్టుకుంటున్నారు. రెడ్‌ షర్టు, మంకీ క్యాప్‌ ధరించిన ఓ వ్యక్తి నల్లాలు దొంగిలించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. నల్లా వస్తే నల్లా, నల్లా రాకుంటే వంకబెండు సహా ఊడదీసి ఎత్తుకెళ్లినట్టు సీసీ ఫుటేజీల్లో కనిపించింది. ఇంతకు ముందుకూడా పాత బస్టాండులోనూ మిషన భగీరథ నల్లాలు చోరీకి గురయ్యాయంటున్నారు. సీసీ ఫూటేజీ ఆధారంగా దొంగను గుర్తించి, అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


Read more