మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-09-27T07:48:28+05:30 IST

మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉప్పల్‌ స్టేడియంలో ఓ అభిమాని ప్లకార్డును ప్రదర్శించాడు.

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలి
హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ప్లకార్డును రాస్తున్న గణేష్‌, ప్లకార్డును ప్రదర్శిస్తున్న దృశ్యం

 ఉప్పల్‌ స్టేడియంలో ప్లకార్డు ప్రదర్శన

మిర్యాలగూడ, సెప్టెంబరు 26:మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉప్పల్‌ స్టేడియంలో ఓ అభిమాని ప్లకార్డును ప్రదర్శించాడు. హైదారాబాద్‌లోని  ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం  జరిగిన భారత్‌–ఆస్త్రేలియా మధ్య జరిగిన అంతర్జాతీయ టి–20 క్రికెట్‌ మ్యాచ్‌లో అభిమానుల కోలాహలం మధ్య మిర్యాలగూడ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను తెలిపేలా  ఓ యువకుడు ఫ్లకార్డును ప్రదర్శించాడు. మిర్యాలగూడ మండలం కురియాతండాకు చెందిన గణేష్‌ తన వెంట  తీసుకువెళ్లిన డ్రాయింగ్‌ షీట్‌పై మిర్యాలగూడ జిల్లా సాధన కమిటీ అని స్కెచ్‌తో రాసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా  గణేష్‌ పట్టణంలో సోమవారం  మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తారన్న ఆశతో ప్లకార్డు ప్రదర్శించానన్నారు. జిల్లా ఏర్పాటు వాంఛను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడానికి ఈ ప్రయత్నం చేశానన్నారు. 
Read more