మంత్రి కేటీఆర్‌ భాష మార్చుకోవాలి

ABN , First Publish Date - 2022-10-14T05:48:25+05:30 IST

మంత్రి కేటీఆర్‌ మాట్లాడే భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునం దన్‌రావు అన్నారు.

మంత్రి కేటీఆర్‌ భాష మార్చుకోవాలి
సంస్థాన్‌నారాయణపురంలో ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు 

సంస్థాన్‌ నారాయణపురం, అక్టోబరు 13: మంత్రి కేటీఆర్‌ మాట్లాడే భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునం దన్‌రావు అన్నారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలని కోరు తూ సంస్థాన్‌నారాయణపురంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అడిగారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం  ప్రజల కోసం చేస్తున్న పనులను వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు.  బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి గురించి కేటీఆర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 12మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు వారికి ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్‌ ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నిం చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మును గోడులో బీజేపీ గెలిపిస్తే తెలంగాణకు మహార్ధశ వస్తుందని ఆయన అన్నారు. ఇప్ప టికే ఎన్నోపార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వా లని రఘునందన్‌రావు కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దోనూరి వీరారెడ్డి, మండల అధ్యక్షుడు జక్కలి విక్రమ్‌, నాయకులు సూరపల్లి శివాజీ, ఉప్పల లింగస్వామి, రాసాల వెంకటేశం, వంగరి రఘు, రాచకొండ గిరి, రాజు పాల్గొన్నారు. 

Read more