రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2022-02-16T19:53:08+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను హేళన చేస్తూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డిపై మంత్రి జగదీష్‌ రెడ్డి ఫైర్

నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను హేళన చేస్తూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కార హీనుడిగా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. రేవంత్ చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. ఉద్యమంలో కుట్రలు చేసినోళ్లకు మూటలు మోసిన చరిత్ర రేవంత్‌ది అని విమర్శించారు. కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకే రేవంత్ పార్టీలో చేరారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేత కాదు.. టీటీడీపీ కోవర్ట్ అని జగదీష్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

Read more