నేడు, రేపు మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-08T06:24:39+05:30 IST

మహ్మద్‌ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకొని మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. భువనగిరిలోని జలీల్‌పుర మసీద్‌లో శని, ఆదివారాల్లో వేడుకలు కొనసాగుతాయని మసీద్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ మీరా చౌదరి శుక్రవారం తెలిపారు.

నేడు, రేపు మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలు
విద్యుత్‌ దీపాల అలకరణలో జలీల్‌పుర మసీద్‌

భువనగిరి టౌన్‌, అక్టోబరు 7: మహ్మద్‌ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకొని మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. భువనగిరిలోని జలీల్‌పుర మసీద్‌లో శని, ఆదివారాల్లో వేడుకలు కొనసాగుతాయని మసీద్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ మీరా చౌదరి శుక్రవారం తెలిపారు. శనివారం రాత్రి 7.30గంటలకు మసీద్‌లో నిర్వహించే కార్యక్రమంలో మతపెద్దలు, రాజకీయ నాయకులు పాల్గొంటారని, ఆదివారం ఉదయం 8.30గంటలకు మసీద్‌ నుంచి పట్టణంలో మిలాద్‌-ఉన్‌-నబీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ముస్లీంలంతా వేడుకల్లో పాల్గొనాలని కోరారు. 

Read more