సంస్కరణ పేరుతో మోటార్లకు మీటర్లు

ABN , First Publish Date - 2022-09-22T05:26:59+05:30 IST

విద్యుత్‌ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

సంస్కరణ పేరుతో మోటార్లకు మీటర్లు
మార్కెట్‌లోని కూలీలకు ఏకరూప దుస్తులు అందజేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి, పక్కన చైర్‌పర్సన్‌ లలితాదేవి

 మీటర్లు వద్దని అడ్డుకున్న సీఎం కేసీఆర్‌

 వ్యవసాయరంగం నిర్వీర్యానికి మోదీ ప్రయత్నం 

 మనువాదుల చేతుల్లోకి భారతదేశం

 మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట సిటీ, సెప్టెంబరు 21 : విద్యుత్‌ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. విద్యుత్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా, మోటార్లకు మీటర్లు పెట్టవద్దని సీఎం కేసీఆర్‌ పోరాడుతున్నారని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో హమాలీ, దడ్వాయి, స్వీపర్లు, కూలీలకు ఏకరూప దుస్తులను బుధవారం పంపిణీ చేశారు. గుజరాత్‌ రాష్ట్రంలో విద్యుత్‌ సంస్కరణలు చేసి రైతుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం ఆటలాడుతోందని మంత్రి అన్నారు. బ్రిటీష్‌ వారి పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించిన వారే నేడు మనువాదుల చేతుల్లో దేశాన్ని పెట్టడం జరిగిందన్నారు.  తెలంగాణపై బీజేపీ కన్ను పడిందన్నారు. 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోనూ ఆరుగంటలే విద్యుత్‌ అందిస్తున్నారన్నారు. అంతకుముందు సూర్యాపేట సమీపంలోని శాంతినగర్‌లో గోదాంల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్య, సంక్షేమం  చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్‌చైర్మన్‌ కిషోర్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలిత, వైస్‌చైర్మన్‌ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఉప్పల ఆనంద్‌, వై వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు సల్మమస్తాన్‌, నాగేశ్వర్‌రావు, నాగరాజు, సైదులు, మార్కెట్‌ కార్యదర్శి ఫసియొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం 

పెన్‌పహాడ్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి గుంటకండ్ల  జగదీ్‌షరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సర్వశిక్ష అభియాన్‌ నిధులు రూ.4.50 లక్షలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల భవనాన్ని విద్య, సంక్షేమం చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటుగా నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యప్రద ర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, ఎంపీపీ నెమ్మాది భిక్షం, వైస్‌ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, జడ్పీటీసీ మామిడి అనిత, సర్పంచ్‌ తూముల శ్వేత, ఎంపీటీసీ ఊరుకొండ జానకమ్మ, కేజీబీవీ ప్రత్యేక అధికారి హాసినాబేగం, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ రఫీ, పీఏసీఎస్‌ చైర్మన్లు జానకిరాంరెడ్డి, సీతారాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యుగంధర్‌, ఆర్‌ఎస్‌ ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారావు, మండల అధ్యక్షుడు నాగార్జున, అమృతారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-22T05:26:59+05:30 IST