సేవాభావంతో వైద్య చికిత్సలు అందించాలి

ABN , First Publish Date - 2022-10-11T06:11:41+05:30 IST

ఆ స్పత్రుల యాజమాన్యాలు ప్రజలకు సే వాభావంతో వైద్య చి కిత్సలు అందించాలని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రె డ్డి అన్నారు.

సేవాభావంతో వైద్య చికిత్సలు అందించాలి
రోహిత ఆస్పత్రిని ప్రారంభిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి

రోహిత కంటి ఆస్పత్రి ప్రారంభించిన మండలి చైర్మన గుత్తా  

నల్లగొండ అర్బన, అక్టోబరు 10:  ఆ స్పత్రుల యాజమాన్యాలు ప్రజలకు సే వాభావంతో వైద్య చి కిత్సలు అందించాలని శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రె డ్డి అన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన రోహిత చెవి, ముక్కు, గొంతు, కంటి ఆస్పత్రిని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రులకు వచ్చే సామాన్య, పేదలకు సేవా దృకథం తో లాభాపేక్ష లేకుండా వైద్యసేవలు అందించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో అధునాతన వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులతో రోహిత ఆస్పత్రిని నెలకొల్పడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఆస్పత్రి నిర్వాహకుడు డాక్ట ర్‌ ఇమాన్యుయల్‌ మాట్లాడుతు అధునాతన పరికరాలతో జిల్లాలో ఎక్కడా లేని విధంగా రోహిత కంటి ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమెరికా, జపాన పరికరాలతో కంటి పరీక్షలు చేసి అత్యాధునిక పద్ధతుల్లో శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే  కిషోర్‌కుమార్‌, డీఎంహెచవో కొండల్‌రావు, మునిసిపల్‌ చైర్మన మందడి సైదిరెడ్డి, ఆస్పత్రి డాక్టర్లు రోహిత, నితీషా ఎండవల్లి, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. 


Read more