కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-30T00:33:52+05:30 IST

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలకేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

మద్దిరాల, డిసెంబరు 29 : కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలకేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మద్దిరాల మండలకేంద్రానికి చెందిన చామకూరి రాములు-నిర్మల దంపతుల పెద్దకుమార్తె సంధ్య(32)ను మండలంలోని కుక్కడం గ్రామానికి చెందిన గునగంటి ఆంజనేయులుతో పదేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కలహాలు రావడంతో మూడు నెలల క్రితం పిల్లలతో పుట్టిల్లు మద్దిరాల మండల కేంద్రానికి వచ్చి ఉంటోంది. తీవ్రమనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుంటుండగా పిల్లలు కేకలు వేశారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసే సమయానికి సంధ్య మృతి చెందింది. ఈ ఘటనపై ఎటు వంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-12-30T00:33:52+05:30 IST

Read more