కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-18T06:05:55+05:30 IST

కుటుంబ సభ్యులతో గొడవప డి మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులతో ఘర్షణ పడి వ్యక్తి ఆత్మహత్య
వెంకట్‌రెడ్డి మృతదేహం

దేవరకొండ, జూలై 17: కుటుంబ సభ్యులతో గొడవప డి మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేవరకొండ మండలం ఎల్లారెడ్డిబావి గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. దేవరకొండ ఎస్‌ఐ వెంకట య్య, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... ఎ ల్లారెడ్డిబావి గ్రామానికి చెందిన శ్రీపతి ముత్యపురెడ్డి రాములమ్మ దంపతులకు వెంకట్‌రెడ్డి (35) ఒక్కడే కుమారుడు. వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వెంకట్‌రెడ్డికి మూడేళ్ల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లా మోహినబాద్‌కు చెందిన స్వాతితో వివాహమైంది. సంతానం లేరు. వెంకట్‌రెడ్డి తరచూ మద్యం తాగి భార్య, తల్లిదండ్రులతో గొడవపడుతుండేవాడు. ఈ నెల 15వ తేదీన వెంకట్‌రెడ్డి మ ద్యం తాగి భార్యను కొట్టడంతో బాధ భరించలేక స్వాతి తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఈ నెల 16వ తేదీన మద్యం తాగి తల్లిదండ్రులతో వెంకట్‌రెడ్డి గొడవపడ్డాడు. కుమారుడికి భయపడి తల్లిదండ్రులు ఇంటి బయట ఉండగా మద్యం మత్తులో ఉన్న వెంకట్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు బయటకు రాకపోవడంతో తండ్రి వెళ్లి చూడగా అప్పటికే వెంకట్‌రెడ్డి మృతి చెందాడు. మృతుని తండ్రి ముత్యపురెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటయ్య తెలిపారు. 


Read more