మహానాయకుడు కేసీఆర్‌: హోంమంత్రి

ABN , First Publish Date - 2022-02-23T05:54:25+05:30 IST

తెలంగాణ సాధనలో ముందు నిలిచిన మహానాయకుడు సీఎం కేసీఆర్‌ అని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

మహానాయకుడు కేసీఆర్‌: హోంమంత్రి
ది అచీవర్‌ పుస్తక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి మహమూద్‌ అలీ

మఠంపల్లి, ఫిబ్రవరి 22 : తెలంగాణ సాధనలో ముందు నిలిచిన మహానాయకుడు సీఎం కేసీఆర్‌ అని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాన నిపుణుడు తాటికొండ వేణుగోపాల్‌రెడ్డి, విజయార్కెలు రచించనున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ది అచీవర్‌ పుస్తక ముఖచిత్రాన్ని హైదరాబాద్‌లో హోంమంత్రి తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తరుణంలో పోరాట విజయాలు, కార్యదక్షతను వివరిస్తూ పుస్తకాన్ని తీసుకురావాలన్న ఆలోచనను ఆయన అభినందించారు. ఒక వ్యక్తి తపస్సు, నిబద్ధత ఎన్నో విజయాలను అందిస్తుంది అనడానికి ఉదాహరణ కేసీఆర్‌ అని ది అచీవర్‌ పుస్తకం వివరిస్తుందని పుస్తక రచయితల్లో ఒకరైన వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. 


Read more