వైభవంగా మద్దెలమ్మదేవి బోనాలు
ABN , First Publish Date - 2022-07-18T06:14:24+05:30 IST
పట్టణంలోని పద్మశాలీయుల కులదేవత మద్దెలమ్మదేవి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది.

భూదానపోచంపల్లి, జూలై 17 : పట్టణంలోని పద్మశాలీయుల కులదేవత మద్దెలమ్మదేవి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి మేలుకొలుపుతోపా ప్రారంభమైన జాతరలో భాగంగా పట్టణంలోని మార్కండేశ్వరస్వామి దేవాలయం నుండి మద్దెలమ్మదేవి ఆలయం వరకు మహిళా భక్తులు బోనాలు తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి, గూడూరు నరోత్తంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, అమ్మవారి పలహారబండి (తొట్టెల) ఊరేగింపు మార్కండేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై మద్దెలమ్మదేవి ఆలయానికి చేరుకుంది. ఊరేగింపులో ఓ ట్రాక్టర్‌పై ఏర్పాటు చేసిన మగ్గంపై కార్మికుడు గుద్దేటి నర్సింహ చీరను నేసి అమ్మవారికి సమర్పించారు. మునిసిపల్ చైర్‌పర్సన చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్ బోనమెత్తి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. ఉత్సవాల్లో మద్దెలమ్మదేవి ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నకేశవులు, నాయకులు కడవేరు చంద్రశేఖర్, భారత గిరివాసు, ఆడెపు ఆంజనేయులు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సూరపల్లి రాము, ఉపాధ్యక్షులు రవ్వ నవీన, బత్తుల బాలాజీ, వేముల జనార్ధన, ఆడెపు అరవింద్, సంగెం నవకుమార్, ఏలె శ్రీశ్రీ, పగిడిమర్రి రాజు, సీత సుధాకర్,, ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, చేనేత నాయకులు టి.వెంకటేష్, భారత వాసుదేవ్, లవకుమార్, ఎ.మురళి పాల్గొన్నారు.
ఆధ్యాతిక భావాన్ని పెంపొందించుకోవాలి : జడ్పీ చైర్మన సందీప్‌రెడ్డి
ప్రతి ఒక్కరూ ఆధ్యాతిక చింతన అలవర్చుకోవాలని, దేవాలయ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని జిల్లా పరిషత చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి అన్నారు. భూదానపోచంపల్లి మండలం గౌసుకొండ గ్రామంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా అమ్మవారి విగ్రహప్రతిష్ఠాపన, బోనాల ఉత్సవాలకు ఆయన హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వేర్వేరుగా అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి వీరబోనం సర్పంచు పక్కీరు లావణ్య దేవేందర్‌రెడ్డి సమర్పించారు.
ఘనంగా ఆందోళ్‌మైసమ్మ బోనాల ఉత్సవాలు
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని ఆందోళ్‌మైసమ్మ దేవాలయ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం బోనాల పండుగను దేవాదయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన ఎలిమినేటి సందీ్‌పరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, బూర నర్సయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ పూజల్లో పాల్గొన్నారు. వందలాది మంది మహిళలు బోనాలతో దేవాలయం చుట్టు ప్రదక్షణలు చేశారు. అమ్మవారికి నేవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం విందులు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చైర్మన సిద్దిపేట శేఖర్‌రెడ్డి, ఈఓ చిట్టెడి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.