విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయింపు తగదు

ABN , First Publish Date - 2022-03-16T05:35:44+05:30 IST

విద్యారంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. కొండమల్లేపల్లి మార్కెట్‌ యార్డులో మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ 43వ జిల్లా మహాసభల్లో మాట్లాడారు. విద్యా

విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయింపు తగదు

మహాసభలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

కొండమల్లేపల్లి, మార్చి 15: విద్యారంగానికి ప్రభుత్వం బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. కొండమల్లేపల్లి మార్కెట్‌ యార్డులో మంగళవారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ 43వ జిల్లా మహాసభల్లో మాట్లాడారు. విద్యారంగానికి తక్కువ బడ్జెట్‌ కేటా యించి విద్యారంగాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను గురుకుల స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగాల పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లా డుతూ మన ఊరు, మన బడి నిధులు విడుదల చేసి ప్రభుత్వ పా ఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్‌, శంకర్‌, కంభాలపల్లి ఆనంద్‌, నల్ల వెంకటయ్య, రమావత్‌ లక్ష్మణ్‌, బూడిద వెంకటేష్‌,  శ్రీకాంత్‌, గోపి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-16T05:35:44+05:30 IST