దేశ వ్యాప్తంగా పేదలకు భూపంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2022-09-14T05:28:57+05:30 IST

దేశ వ్యాప్తంగా నిరుపేదలందరికీ ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్‌ చేశారు.

దేశ వ్యాప్తంగా పేదలకు భూపంపిణీ చేయాలి సమావేశంలో మాట్లాడుతున్న వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య

భువనగిరి టౌన, సెప్టెంబరు 13: దేశ వ్యాప్తంగా నిరుపేదలందరికీ ప్రభుత్వ భూములను పంపిణీ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం భువనగిరిలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో లక్షలాది ఎకరాల మిగులు భూములు ఉన్నాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ కూలీ రూ.600లకు పెంచాలన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలని, ప్రైవేట్‌ ఆసుపత్రుల దోపిడీని నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు ఎండి జహాంగీర్‌, జూకంటి పైల్‌, సల్లూరి కుమార్‌, పల్లెర్ల అంజయ్య, గుంటోజు శ్రీనివాస్‌, సిర్పింగి స్వామి, ముత్యాలు, బాలయ్య, బూషయ్య పాల్గొన్నారు.


Read more