సంప్రదాయరీతిలో లక్ష్మీ పూజలు

ABN , First Publish Date - 2022-02-19T05:35:43+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీ పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన

సంప్రదాయరీతిలో లక్ష్మీ పూజలు
బాలాలయంలో ఆండాల్‌ అమ్మవారి ఊంజల్‌ సేవ నిర్వహిస్తున్న అర్చకులు

యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 18: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీ పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పిన ఆచార్యులు బాలాలయ కవచమూర్తులను అభిషేకించి తులసీదళాలు, కుంకుమలతో అర్చించారు. కల్యాణ మండపంలో సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణపర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్‌ అమ్మవారిని ఆరాధిస్తూ అర్చకులు ఊంజల్‌ సేవోత్సవం నిర్వహించారు. స్వామి వారి విమాన గోపురం బంగారు తాపడానికి యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన భక్తులు మిట్ట శ్రీదేవి వీరేశ్‌ కుటుంబ సభ్యులు రూ.50,109, దేవస్థాన ఉప ప్రధాన పురోహితులు కె.సుదర్శనాచార్యులు రూ.లక్ష విరాళం అందజేశారు. స్వామికి భక్తుల సమర్పించిన నగదు, నగదు లెక్కింపులను 24న హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ ఊంజల్‌ సేవోత్సవం నేత్రపర్వంగా సాగింది. కాగా ఆలయ విస్తరణ పనులను వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, దేవస్థాన ఈవో గీతారెడ్డి పరిశీలించారు. వీరు ప్రధానాలయం కొండపైన పునర్నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించి పనుల పురోగతిపై ఆరాతీశారు. వీరివెంట ఆలయ అధికారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.12,03,900 ఆదాయం  సమకూరింది. 


రెండోరోజూ కొనసాగిన ఆందోళన

యాదాద్రి కొండ కింద మెట్ల దారిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల ఆలయం తొలగింపుపై వివాస్పదమైంది. రెండోరోజూ స్థానికులు ఆందోళన చేపట్టారు. ఆలయ తొలగింపునకు కళావరోహణ పూజలు నిర్వహించడంపై స్థానికులు అడ్డుకున్న విషయం విధితమే. శుక్రవారం విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆఽధ్వర్యలో స్వామివారి పాదాల ఆలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా  వీహెచ్‌పీ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు గిరెడ్డి బాపురెడ్డి మాట్లాడుతూ ఆలయాన్ని తొలగించడం వల్ల స్వామివారి పవిత్రతకు భంగం కలుగుతుందని, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. 

Read more