కుర్రారం చెరువు అలుగుకు గండి

ABN , First Publish Date - 2022-09-17T06:17:27+05:30 IST

మండలంలోని కుర్రారం ఊర చెరువుకు శుక్రవారం అలుగుకు మరోసారి గండి పడింది. 10మీటర్ల మేర మత్తడి ధ్వంసం కావడంతో నీరంతా వృఽథాగా పోతోంది.

కుర్రారం చెరువు అలుగుకు గండి
కోతకు గురైన అలుగు ప్రాంతం

 వృఽథాగా పోతున్న నీరు 

రాజాపేట, సెప్టెంబరు 16: మండలంలోని కుర్రారం ఊర చెరువుకు శుక్రవారం అలుగుకు మరోసారి గండి పడింది. 10మీటర్ల మేర మత్తడి ధ్వంసం కావడంతో నీరంతా వృఽథాగా పోతోంది. రెండు రోజులుగా గ్రామస్థులు అధికారులకు విన్నవించినా అఽధికారులు పట్టించుకోకపోవడంతో మత్తడి కింద గండి కోతకు గురై కూలిపోయింది. గ్రామస్థులు, ఇతర పార్టీల నాయకుల సహకారంతో ఇసుక సంచులు వేసి గండిపేడ్చే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మత్తడి పూర్తిగా ఽఽధ్వంసం కాకుండా ఉండేందుకు  చిన్నగా కాల్వను తవ్వి నీటిని మళ్లించారు. అధికారులు మాత్రం ఎటువంటి మరమ్మతులు చేపట్టక పోవడంతో గ్రామస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  మండలంలోని  కుర్రారం ఊర చెరువుకు మరోసారి గండి పండడంతో నీరంతా వృఽథోగా పోతుంది. చెరువులోని నీరు ఖాళీ అవుతుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితమే కుర్రారం చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం అని ఆంధ్రజ్యోతికి ముందుగానే హెచ్చరించింది. ఐబీ అధికారులు చెరువును సందర్శించి మరమ్మతులు చేపడుతామని గ్రామస్థులు రైతులకు హామీ ఇచ్చి ఎటువంటి మరమ్మతు పనులు చేపట్టలేదు. అధికారులు నిధులను కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


Read more