కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయాలను సాధించాలి

ABN , First Publish Date - 2022-09-28T06:09:19+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధనకు విశేష కృషిచేసిన ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. లక్ష్మణ్‌బాపూజీ 107వ జయంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.

కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయాలను సాధించాలి
కొండా లక్ష్మణ్‌బాపూజీకి చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ టౌన్‌, సెప్టెంబరు 27: తెలంగాణ రాష్ట్ర సాధనకు విశేష కృషిచేసిన ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. లక్ష్మణ్‌బాపూజీ 107వ జయంతి సందర్భంగా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు లక్ష్మణ్‌బాపూజీ అని కొనియాడారు. స్వాతంత్య్ర పోరాటంలో నిజాం,రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాలొ ్గన్న యోధుడని అన్నారు. రాజకీయవేత్తగా నిస్వార్థంగా సేవలందించారన్నారు. ఆయన ఆశయాల మేరకు రాష్ట్ర అభివృద్థికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, అదనపుకలెక్టర్లు రాహుల్‌శర్మ, భాస్కర్‌రావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరిగి పెద్దులు, బీసీ సంక్షేమశాఖ జిల్లాధికారి పుష్పలత, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చొల్లేటి ప్రభాకర్‌, టీఎన్‌జీవో్‌స జిల్లా అధ్యక్షుడు మంత్రవాది శ్రవణ్‌కుమార్‌, కొండూరు సత్యనారాయణ పాల్గొన్నారు.

Read more