ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-11-30T00:08:03+05:30 IST

ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్యే నోముల భగత అన్నారు.

ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌
హాలియాలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే భగత

హాలియా / నల్లగొండ టౌన / గుర్రంపోడు, నవంబరు 29 : ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్యే నోముల భగత అన్నారు. కేసీఆర్‌ దీక్షా దివ్‌సకు 13 ఏళ్లు పూర్తయిన సందర్భగా హాలియాలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఆయన క్షీరాభిషేకం చేసి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ రాష్ట్రాన్ని సాధించుకోవడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్పనాయకుడని అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన వెంపటి పార్వతమ్మశంకరయ్య, మల్గిరెడ్డి లింగారెడ్డి, వర్ర వెంకట్‌రెడ్డి, అన్నెపాక శ్రీను, నల్లబోతు వెం టయ్య, కూరాకుల వెంకటేశ్వర్లు, చెరుపల్లి ముత్యాలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంసీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు అక్షర కిరణం స్వచ్ఛంద సేవ సంస్థలో మలిదశ ఉద్యమకారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అనుముల మండల ఎంపీపీ సుమతిపురుషోత్తం, జిల్లా మైనార్టీ నాయకులు అబ్దుల్‌ హలీం, మలిదశ ఉద్యమారులు మధుసూదనరెడ్డి, అంజాద్‌ఖాన, కొట్టాల శ్రీను, రావులపాటి సైదులు, యడవల్లి శోభన పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలోని శ్రీకాంతాచారి విగ్రహానికి ఆయన తల్లి కాసోజు శంకరమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పర్వతం అశోక్‌, విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం పట్టణ అధ్యక్షుడు రమేష్‌, నాయకులు కాసోజు శంకరాచారి, ఉపాధ్యక్షుడు గడగోజు విజయ్‌, చిన్నజోరాజు, చొక్కళ్ల మధు పాల్గొన్నారు. మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి రోజును తెలంగాణ యూతడేగా ప్రకటించాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్జీ కళాశాలలోని పెంటయ్య హాస్టల్‌ ఆవరణలో శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ యూతడే సదస్సు వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువజన సమితి జిల్లా అధ్యక్షుడు మేకల శివ, విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధీరావత వీరానాయక్‌, మారగోని సైదులు, జానయ్య, సుదర్శన ఉన్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్‌రెడ్డి పాశం గోపాల్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. దీక్షా దివా్‌సతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. సమావేశంలో ఉట్లపల్లి సర్పంచ షేక్‌ షాహిన మదర్‌షా తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-30T00:08:06+05:30 IST