కేసీఆర్‌ పథకాలు దేశానికి ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-25T06:12:57+05:30 IST

సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేసు ్తన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అన్నారు.

కేసీఆర్‌ పథకాలు దేశానికి ఆదర్శం
మర్రిగూడలో మాట్లాడుతున్న ఎంపీ లింగయ్య యాదవ్‌

ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ 

 మర్రిగూడలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

మర్రిగూడ, సెప్టెంబరు 24: సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేసు ్తన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, అన్నారు. మర్రిగూడ మండలకేంద్రంలో శనివారం టీఆర్‌ఎస్‌ మండల స్థాయి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమానికి వారు హాజరై మాట్లాడారు. కేంద్రప్రభుత్వం రైతులకు వ్యవసాయ మోటార్లకు మీటర్లను అమర్చి దేశంలోనే వ్యవసా యం లేకుండా చేయడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇది దేశ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే వ్యవసాయం సాగదని, మీటర్లు అమర్చుతానన్న వారిని రాష్ట్ర ప్రజలు ఈ ఉప ఎన్నికలో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ గత పాలకులు చేసిన దుర్మార్గపు చర్య వల్లే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరిన్‌ సమస్య ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లోరిన్‌ నుంచి విముక్తి కల్పించేందుకు మిషన్‌ భగీరథ నీటిని అందించి ఫ్లోరిన్‌ బాధితుల కు అండగా నిలిచారని పేర్కొన్నారు. మునుగోడు వెనకబాటుకు కారణం రాజగోపాల్‌రెడ్డే కారణమని, ఆయన అసమర్థత వల్లే నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేకపోయిందన్నారు. రానున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు, చేనేత కూలీలు, రైతు కూలీలు ఆకలి చావులు, ఆత్మహత్యలను నివారించినట్లు తెలిపారు. మునుగోడును అభివృద్ధి చేయలేకనే రాజీనామా చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, పాశం సురేందర్‌రెడ్డి, దళితబంధు జిల్లా కమిటీ సభ్యుడు బక్కని నర్సింహ, నాయకులు పందుల యాదయ్య, బాలం నర్సింహ, వెంకటయ్య, కృష్ణ,  యాదయ్యగౌడ్‌ పాల్గొన్నారు. 

Read more