కేసీఆర్‌ మోసపూరిత పాలనకు గుణపాఠం తప్పదు

ABN , First Publish Date - 2022-06-07T06:38:56+05:30 IST

సబ్బండ వర్గాలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, మాటలతో మభ్యపెడు తూ మోసపూరిత పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగి న గుణపాఠం చెబుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

కేసీఆర్‌ మోసపూరిత పాలనకు గుణపాఠం తప్పదు
సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో వీరభద్రంకు మెమోంటోను బహుకరిస్తున్న జిల్లా కార్యదర్శి జహంగీర్‌

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  


భువనగిరి రూరల్‌, జూన్‌ 6 : సబ్బండ వర్గాలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, మాటలతో మభ్యపెడు తూ మోసపూరిత పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగి న గుణపాఠం చెబుతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. భువనగిరి శివారులో సోమవారం నిర్వహించిన సీపీఎం రాజకీ య శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్ర సంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించకుండా మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతుందన్నారు. పెట్రోల్‌, డీజీల్‌, గ్యాస్‌ ధరల పెంపుతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రధాని నరేంద్రమోదీకి చీమకుట్టినట్టుగా లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మేక అశోక్‌ రెడ్డి, పెంటయ్య, వెంకటేశం, ఎం రాజయ్య, ఎస్‌ స్వామి, ఎండి పాష, జి సైదులు, ఎం కృష్ణ, బి పోశెట్టి, బి జయరాములు, గునుగుంట్ల శ్రీనివాస్‌, వనం రాజు, దేవేందర్‌ రెడ్డి తదితరులున్నారు. 


ఇచ్చిన మాట ఏమైంది కేసీఆర్‌? 

యాదగిరిగుట్ట రూరల్‌: కొండపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉన్నంతకాలం గుట్టపైకి ఆటో కార్మికులకు అనుమతి ఉంటుందని  కేసీఆర్‌ ఇచ్చిన మాట ఏమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. కొండపైకి ఆటోలను అనుమతించాలని గుట్టలో కార్మికులు చేపట్టిన దీక్షలు సోమవారం 71 రోజుకు చేరుకోగా,దీక్షా శిబిరాన్ని వీరభద్రం సందర్శించి, సం ఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30ఏళ్ల నుంచి భక్తులకు సేవలు అందిస్తున్న కార్మికులకు అన్యాయం జరగదని సీఎం మాటిచ్చి, నేడు ఆటోలను కొండపైకి అనుమతించకపోవడం సరికాదన్నారు. ఆటోలను అనుమతించాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌, నాయకులు పాల్గొన్నారు.

Read more