నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-09-30T06:58:07+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 30వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బేగంపేటకు చేరుకుని, ఉదయం 11.30గంటలకు యాదగిరిగుట్ట క్షేత్రానికి రోడ్డు మార్గాన చేరుకోనున్నారు.

నేడు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్‌

యాదాద్రి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 30వ తేదీన యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకోనున్నారు. ఉదయం 10.30గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బేగంపేటకు చేరుకుని, ఉదయం 11.30గంటలకు యాదగిరిగుట్ట క్షేత్రానికి రోడ్డు మార్గాన చేరుకోనున్నారు. యాదగిరిగుట్ట ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు గతంలో తమ కుటుంబం తరపున ప్రకటించిన 1కిలో 16తులాల బంగారాన్ని వైటీడీఏ అధికారులకు అందజేయనున్నారు. అనంతరం లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు యాదగిరిగుట్ట కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు చేరుకుంటారని సీఎంవో కార్యాలయం నుంచి యాదగిరిగుట్ట దేవస్థానానికి సమాచారమిచ్చారు.

Read more