కేసీఆర్‌ అవినీతి మాటేదీ

ABN , First Publish Date - 2022-07-05T05:55:39+05:30 IST

సీఎం కేసీఆర్‌ అవినీతిపై హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన విజ య సంకల్ప్‌ సభలో ప్రధాని మో దీ నోరు మెదపలేదని, దీంతో బీజే పీ, టీఆర్‌ఎస్‌ రహస్య ఒప్పందం ఏంటో తెలుస్తోందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు.

కేసీఆర్‌ అవినీతి మాటేదీ
మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

బీజేపీ, టీఆర్‌ఎస్‌ గల్లీల్లో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ 

నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ రూరల్‌, జూలై 4: సీఎం కేసీఆర్‌ అవినీతిపై హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించిన విజ య సంకల్ప్‌ సభలో ప్రధాని మో దీ నోరు మెదపలేదని, దీంతో బీజే పీ, టీఆర్‌ఎస్‌ రహస్య ఒప్పందం ఏంటో తెలుస్తోందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నా రు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని దోరకుంట, నల్లబండగూడెం, రెడ్లకుంట, కూచిపూడి, కూచిపూడితండ, అల్వాలపురం గ్రామాల్లో సతీమణి పద్మావతితో కలి సి సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ, కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కేంద్ర మంత్రులు చెబుతున్నా ప్రధా ని మోదీ ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల వ్యవహారం గల్లీల్లో కుస్తీ, ఢిల్లీలో దోస్తీలా ఉందన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయన్నారు. ప్రజలందరూ కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌ ఇస్తున్న రైతుబంధు రూ.5 వేలను రూ.15 వేలకు పెంచి అందజేస్తామన్నారు. పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతుబంధు వర్తింపజేస్తామన్నారు. లక్ష రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్‌ ఇచ్చిన హామీని మరిచారని ఎద్దే వా చేశారు. రైతులు బ్యాంకుల్లో అప్పులు లభించక వడ్డీలకు తెచ్చుకునే పరిస్థితి నెలకొందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలేదన్నారు. కోదాడలో కాంగ్రెస్‌ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నా రు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని కాంగ్రెస్‌ నాలుగు లేన్లుగా మార్చిందన్నారు. విజయవాడ-హైదరాబాద్‌ మధ్య సూపర్‌ ఫాస్ట్‌ రైలు కోసం కృషి చేస్తున్నాన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డాక్రా రుణాలు అందించకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. పంట బీమా అమలు చేస్తామని, మహిళలకు అభయహస్తం పథకం కొనసాగిస్తామన్నారు. వరి వద్దని చెప్పిన టీఆర్‌ఎస్‌, తిరిగి పంట చేతికొచ్చే సమయానికి కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనాలని రాస్తారోకో చేయడం రైతులను మోసం చేయడమేనన్నారు. కాంగ్రెస్‌ అధికారలోకి వచ్చాక ధాన్యానికి క్వింటాకు రూ.2500 మద్దతు ధర ఇస్తామన్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను, అధికార పార్టీ పలు ఇబ్బందులకు గురిచేస్తోందని, తాము అధికారంలోకి వచ్చాక తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, వంగవీటి రామారావు, వరప్రసాద్‌రెడ్డి, గురువయ్య, గోపాల్‌రెడ్డి, ధనమూర్తి, అర్జున్‌, శ్రీనివా్‌సరావు, డేగ కొండయ్య, హన్మంతరావు, సర్పంచ్‌ కొండా శైలజ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:55:39+05:30 IST