బహుజనులను విస్మరించిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-10-02T06:07:16+05:30 IST

బహుజనులను సీఎం కేసీఆర్‌ విస్మరించారని, బహుజనుల రాజ్యాధికారం కోసమే పాదయాత్ర చేపట్టినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు డు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం బహుజన రాజ్యాధికార యాత్ర 128వ రోజు మండలంలోని మేటిచందాపురం, సరంపేట, గడిశగడ్డ, చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, లెంకలపల్లి, కమ్మగూడెం, భీమనపల్లి గ్రామాల్లో కొనసాగింది.

బహుజనులను విస్మరించిన కేసీఆర్‌
మేటిచందాపురంలో ప్రజాసమస్యలను తెలుసుకుంటున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

రాజ్యాధికారంకోసమే పాదయాత్ర

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 


మర్రిగూడ, అక్టోబ రు 1: బహుజనులను సీఎం కేసీఆర్‌ విస్మరించారని, బహుజనుల రాజ్యాధికారం కోసమే పాదయాత్ర చేపట్టినట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షు డు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శనివారం బహుజన రాజ్యాధికార యాత్ర 128వ రోజు మండలంలోని మేటిచందాపురం, సరంపేట, గడిశగడ్డ, చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, లెంకలపల్లి, కమ్మగూడెం, భీమనపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి బహుజనులను విస్మరించారన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకుండా చూస్తున్నారన్నా రు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ముఖ్యం గా మర్రిగూడ మండలంలో ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువై, గ్రామాల్లో లింక్‌ రోడ్లు అధ్వానంగా ఉండడమే కాకుండా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప అభివృద్ధి జరగదన్నారు. త్వరలో జరిగే ఉపఎన్నికలో మునుగోడు నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దింపుతున్నట్లు తెలిపారు. బహుజనులందరూ ఏకమై బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలకు గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో పూదరి సైదులు, పూదరి నర్సింహ, పల్లెటి రవీందర్‌, అంబేడ్కర్‌, కత్తుల పద్మ, ఎలిజబెత్‌, కాన్షీంరాం, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more